ఫాదర్‌ పాడు బుద్ధి.. చర్చిలో అపచారం | Kerala Priest, 65, Allegedly Sexually Assaulted 10-Year-Old Inside Church | Sakshi
Sakshi News home page

ఫాదర్‌ పాడు బుద్ధి.. చర్చిలో అపచారం

Published Tue, Oct 10 2017 10:25 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Kerala Priest, 65, Allegedly Sexually Assaulted 10-Year-Old Inside Church  - Sakshi

తిరువనంతపురం : కేరళలో ఓ చర్చి ఫాదర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పదేళ్ల బాలికపై చర్చిలో లైంగికదాడి చేసే యత్నం చేశాడు. దీంతో అతడిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరాజ్‌ అనే 65 ఏళ్ల వ్యక్తి తిరువనంతపురంలోని ఓ చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్నారు. ఆ చర్చికి ఓ పదేళ్ల బాలిక బైబిల్‌ స్టడీ సమయంలో వస్తుంటుంది.

ఆ బాలికను రోజు ఆమె తండ్రి వచ్చి తీసుకెళుతుంటాడు. అందులో భాగంగానే ఆదివారం బైబిల్‌ స్టడీ సెషన్‌ పూర్తయిన తర్వాత ఆ బాలికను తీసుకెళ్లేందుకు ఆ తండ్రి వచ్చిన సమయంలో ఫాదర్‌ దేవరాజ్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటం చూశాడు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో అతడిని అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement