అన్న కోసం ఎదురెళ్లి.. | kid dead in school bus accident | Sakshi
Sakshi News home page

అన్న కోసం ఎదురెళ్లి..

Published Sat, Oct 21 2017 9:53 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

kid dead in school bus accident - Sakshi

కామవరపుకోట : అన్న వస్తున్నాడనే సంతోషంతో ఎదురెళ్లిన ఆ చిన్నారి అనూహ్యంగా కానరాని లోకాలకు చేరుకుంది. తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసిన ఈ ఘటన మండలంలోని ఆడమిల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆడమిల్లికి చెందిన వేముల వెంకటేశ్వరరావు కుమారుడు గణేశ్‌ కామవరపుకోటలోని ఒక ప్రైవేట్‌ విద్యాసంస్ధలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. అతడు రోజూ పాఠశాలకు చెందిన బస్సులో వెళ్లి వస్తాడు. రోజూ సాయంత్రం బస్సు వచ్చే సమయానికి అన్న కోసం లోహిత (3) బస్సు వద్దకు వెళుతుంది. శుక్రవారం కూడా అన్న వచ్చాడన్న సంతోషంతో లోహిత బస్సు వద్దకు వెళ్లింది.

బస్సు దిగిన గణేష్‌ ఇంటికి వెళుతుండగా అతడి వెనుకే లోహిత వెళుతోంది. ఈలోగా అదే స్కూల్‌ బస్‌ వెనుక నుంచి లోహితను ఢీకొట్టింది. దీంతో చిన్నారి బస్సు చక్రం కింద పడి మరణించింది. ఈ ఘటనతో స్థానికులంతా  అవాక్కయ్యారు. అప్పటివరకు తమ మధ్య ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నారి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన బస్సును డైవర్‌ ఆపకుండా వెళ్లిపోవడంతో గ్రామస్తులు కామవరపుకోట స్కూల్‌ వద్దకు వచ్చి ఆ బస్సును డ్రైవర్‌తో పాటు ఆడమిల్లి తీసుకెళ్లారు. తడికలపూడి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ దీక్షితులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement