
సాక్షి, విజయవాడ : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నిందితులు సుబ్బారావు, ఈశ్వరి, శోభన్‌లను నాలుగు రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులకు ఈ నెల 31 వరకు ఎన్ఐఎ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో నిందితులను విశాఖపట్నం జైలుకు తరలించారు.
కాగా గతేడాది సెప్టెంబర్ 23న కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా డుంబ్రిగూడ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ క్రమంలో ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్‌ఐఏను అదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment