
సాక్షి, అమరావతి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు బదిలీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు హత్యచేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసును విశాఖ జిల్లా డుంబ్రిగుడ పోలీసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఈ ఏడాది నవంబర్ 30న ఎన్‌ఐఏను అదేశించింది. ఈనెల 6వ తేదీన కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హైదరాబాద్ యూనిట్కు అప్పగించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టినట్టు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment