టీడీపీ నేత బార్‌లో మద్యం విక్రయాలు | Liquor Sales at TDP Leader Bar | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత బార్‌లో మద్యం విక్రయాలు

Published Sun, Apr 5 2020 5:11 AM | Last Updated on Sun, Apr 5 2020 12:05 PM

Liquor Sales at TDP Leader Bar - Sakshi

చిత్తూరులోని టీడీపీ నేత నిర్వహిస్తున్న ఎన్‌పీఎస్‌ బార్‌

చిత్తూరు అర్బన్‌:  భౌతిక దూరం పాటించి కరోనా మహమ్మారిని పారదోలాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ పిలుపు ఇస్తే అవేమీ పట్టనట్లు ఓ టీడీపీ నేత యధేచ్చగా మద్యం విక్రయాలు సాగించాడు. చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు బార్‌లో మద్యం విక్రయిస్తుండగా శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.  

► చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెలో ఎన్‌పీఎస్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను టీడీపీ నేత ప్రకాష్‌నాయుడు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్‌లోనూ గత కొన్ని రోజులుగా ఎన్‌పీఎస్‌ బార్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  
► రూ.800 విలువచేసే మద్యం బాటిళ్లను రూ.4 వేలకు, రూ.3 వేల విలువైనవి రూ.10 వేలకు అమ్ముతున్నారని ఎక్సైజ్‌ కమిషనర్‌కు, జిల్లా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.  
► పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కలిసి శనివారం రాత్రి ఓ వ్యక్తిని బార్‌లోకి పంపి మద్యం ఫుల్‌బాటిల్‌ తీసుకురావాలని చెప్పారు. ఇక్కడున్న మేనేజరు మద్యం బాటిల్‌ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
► రూ.లక్షల విలువైన 960 బీర్లు, 60 ఫుల్‌బాటిల్‌ మద్యం సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
► ఈ దాడుల్లో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మధుసూదనరావు, ఏఈఎస్‌ గోవిందనాయక్, సీఐలు పురుషోత్తంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, యుగంధర్, నీరజ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement