
కృష్ణాజిల్లా ,పుట్లచెరువు(కైకలూరు): మండవల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన పి. శ్రీనివాసరావు(24) స్థానికంగా ఇంటర్ చదివి, తిరుపతిలో వైట్‌హౌస్ టీషర్టుల తయారీ దుకాణంలో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుపతి నుంచి ద్విచక్ర వాహనంపై అతను ఇంటికి బయలుదేరాడు. మార్చి 31న గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దులో వెదుళ్లపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా బాపట్ల కొత్త బస్టాండ్‌లో చెట్టుకు ఉరి వేసుకుని మరణించాడు. తనను పోలీసులు ఇబ్బందిపెట్టడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆత్మ హత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపాడు. యువకుడి ఆత్మహత్యపై డీజీపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించి, నివేదిక ఇవ్వాలని గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావును ఆదేశించారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా ఏఎస్పీ చక్రవర్తిని నియమించారు. ఆయన బాపట్ల చేరుకుని వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment