భార్య తలతో 1.5 కిలోమీటర్లు.. | UP Man Decapitated Wife Head And Walks With Head For A Kilometre | Sakshi
Sakshi News home page

భార్య తలతో 1.5 కిలోమీటర్లు..

Published Sat, Feb 1 2020 7:11 PM | Last Updated on Sat, Feb 1 2020 7:29 PM

UP Man Decapitated Wife Head And Walks With Head For A Kilometre - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : క్షణికావేశంలో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆమె తలను శరీరంనుంచి వేరుచేసి దాన్ని చేతితో పట్టుకుని 1.5 కిలోమీటర్లు పిచ్చిపట్టిన వాడిలా చక్కర్లు కొట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని జహంగిరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బహదుర్‌పురా గ్రామానికి చెందిన అకిలేశ్‌ రావత్‌ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన రజని అనే యువతితో వివాహమైంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే అనారోగ్యం కారణంగా ఆ పాప కొద్దిరోజులకే మృత్యువాత పడింది. తరచు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది.

మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రావత్‌ భార్యను ఇంట్లోనుంచి బయటకు లాక్కొచ్చాడు. అనంతరం పదునైన ఆయుధంతో ఆమె తల నరికాడు. తలను ఆమె శరీరం నుంచి వేరుచేసి దాన్ని చేత్తో పట్టుకుని 1.5 కిలోమీటర్లు పిచ్చిపట్టిన వాడిలా చక్కర్లు కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కదిర్‌పుర్‌ అనే గ్రామం వద్ద అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement