ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం : మద్యం తాగేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆటోలో శవమై తేలాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ న్యూకాలనీకి చెందిన బల్లమూడి శంకరరావు(61)తో పాటు మరో ఐదుగురు కలిసి గొప్పిలి సమీపంలోని ఒడిశా సరిహద్దు ప్రాంతానికి నాటుసారా తాగేందుకు మంగళవారం ఉదయాన్నే ఆటోలో వెళ్లారు. అక్కడ పూటుగా తాగి ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ ఐటీఐ రోడ్డులో ఆటోను ఆపి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అయితే శంకరరావు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. శంకరరావుతో పాటు తాగేందుకు వెళ్లిన లక్ష్మీనారాయణ సాయంత్రం ఐటీఐ రోడ్డుకు వెళ్లగా ఆటో ఉండటాన్ని గమనించాడు. లోపలే శంకరరావు అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసు కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించాడు. ( ఎంత పనిచేశావు తండ్రీ! )
కాశీబుగ్గ ఎస్‌ఐ మధుసూదనరావు, సిబ్బందితో చేరుకుని పరిశీలించగా శంకరరావు మృతిచెందినట్లు నిర్ధారించారు. ముఖంపై గాయాలు, రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శంకరరావు మృతికి గల కారణాలు, ఆటో ఎవరిదన్న కోణంలో ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. (విడాకుల కేసులో ఉత్తమ నటుడు)
Comments
Please login to add a commentAdd a comment