
మృతి చెందిన యువకుడు
నెల్లిమర్ల: పట్టణ పరిధిలో పూడమ్మతల్లి వనం గుడి వద్ద మంగళవారం రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ చిరంజీవిరావు తెలిపారు. గుర్తు తెలియని రైలు ఢీకొనడం వల్ల సదరు యువకుడు మృతి చెంది ఉంటాడని చెప్పారు.
మృతుడు వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. నీలం రంగు జీన్ ఫ్యాంటు, నీలం రంగు టీ షర్టు ధరించి ఉన్నట్టు పేర్కొన్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని మహరాజ ఆస్పత్రిలో భద్రపరిచామని ఆచూకీ తెలిసిన వారు 9441468123 నంబర్‌కు సంప్రదించాలని చిరంజీవిరావు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment