
భార్యాబిడ్డలతో చలపతి
చిత్తూరు, కలకడ : గుండెపోటుతో భర్త మృతిచెందాడు. దీన్ని జీర్ణించుకోలేక భార్య ఆవేదన చెంది మృతి చెందింది. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల మృతితో వారి కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ సంఘటన కలకడ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని నవాబుపేట పంచాయతీ హరిజనవాడకు చెందిన మంద చలపతి(33) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనికి మంగళవారం రాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేదు. దీన్ని భార్య సంతోషి(30) జీర్ణించుకోలేకపోయింది. భర్త లేకపోవడంతో ఆవేదన చెందింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. బుధవారం ఉదయం ఆమె కూడా మృతిచెందింది. గంటల వ్యవధిలోనే దంపతులు మృతిచెందడం స్థానికులను కలచి వేసింది. తల్లిదండ్రుల మృతితో వారి కుమారుడు బాలాజీ(8) అనాథగా మిగిలాడు.
సమాచారం అందుకున్న వెలుగు సిబ్బంది గ్రామానికి చేరుకుని విచారించారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.10 వేలు అందజేశారు. మిగిలిన చంద్రన్న బీమా నగదును వారి కుమారుడు పేరు మీద బ్యాంకులో జమచేస్తామని చెప్పారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment