భర్త వేధింపుల వల్లనే ఆత్మహత్య | Married Woman Suspicious death in Karnataka | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Published Wed, Dec 4 2019 11:26 AM | Last Updated on Wed, Dec 4 2019 11:26 AM

Married Woman Suspicious death in Karnataka - Sakshi

ఆశారాణితో రవి (ఫైల్‌)

కర్ణాటక, యశవంతపుర: బెంగళూరులో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 30న ఆశారాణి (30) ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందారు. ఆరేళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన రవితో ఆశారాణికి వివాహం అయింది. భార్యభర్తలిద్దరు బెంగళూరులో పీణ్య ఎస్‌ఆర్‌ఎస్‌ రోడ్డులో ఉంటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు ఘర్షణ పడేవారు. దీంతో ఆశారాణి జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కొన ఉపిరిలో ఉన్న ఆమెను భర్త రవి ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చేసిన చికిత్సలు ఫలించక ఆశారాణి మృతి చెందారు. అయితే భర్త రవి  వేధించటం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆశారాణి బంధువులు ఆరోపించటం వివాదంగా మారింది. ఆర్‌ఎంసీ యార్డ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement