
వడమాలపేట: తల్లిదండ్రులు గుండెలపై భారాన్ని దించుకోవాలనే తపనతో అభం శుభం తెలియని పసిమొగ్గను వదిలించుకునే ప్రయత్నం చేశారు. తిరగబడిన ఆ బాలిక తనకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. బాధితురాలి కథనం మేరకు.. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తిమ్మాపురం గ్రామానికి చెందిన బాలికను ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన దాము (34)కు ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు.
తనకు వివాహం ఇష్టం లేదని, చదువుకుంటానని బాలిక మొరపెట్టుకున్నా తల్లిదండ్రులు ఖాతరు చేయలేదు. తమ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వివాహం చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని తల్లిదండ్రులు బెదిరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి బాలిక ఒప్పుకుంది. వివాహాన్ని తప్పుపట్టిన బంధువులు శుక్రవారం ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది పుత్తూరు పోలీస్‌స్టేషన్ పరధిలో కావడంతో కేసును పుత్తూరుకు బదిలీ చేశారు. ఈ విషయమై పుత్తూరు ఎస్‌ఐ హనుమంతప్పను వివరణ కోరగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment