బాలికపై అత్యాచారం పరిస్థితి విషమం! | Molestation on Girl Child in Kurnool | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం

Published Tue, Feb 5 2019 1:06 PM | Last Updated on Tue, Feb 5 2019 1:06 PM

Molestation on Girl Child in Kurnool - Sakshi

కర్నూలు  ,కొత్తపల్లి: పన్నెండేళ్ల బాలికపై ఓ మృగాడు అకృత్యానికి ఒడిగట్టాడు. మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు.  ఈ ఘటన సోమవారం కొత్తపల్లి మండలం తిమ్మరాజుపల్లెలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ బాబు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన హుస్సేన్‌ ఆలం అనే వ్యక్తి భార్యతోకలిసి పసుపు–కుంకుమ చెక్కుల కోసం సింగరాజుపల్లెకు వచ్చాడు. అయితే.. సింగరాజుపల్లె మజరా గ్రామం కావడంతో గుమ్మడాపురంలో అధికారులు చెక్కుల పంపిణీ చేపట్టారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లింది. హుస్సేన్‌ ఆలం మాత్రం సింగరాజుపల్లెలోనే ఉండిపోయాడు. గ్రామంలోని ఓ ఇంట్లో కొందరు పిల్లలు ఆడుకుంటుండగా అక్కడికి చేరాడు.

ఆ సమయంలో ఇంట్లో పెద్దలెవరూ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్నాడు. ఏడో తరగతి చదివే ఓ బాలికకు మాయమాటలు చెప్పాడు. గదిలోకి తీసుకెళ్లి.. అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారం చేశాడు. తర్వాత అక్కడి నుంచి ఉడాయించాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు గమనించి..ఏం జరిగిందని ప్రశ్నించారు. అసలు విషయం చెప్పింది. వెంటనే కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి..విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement