ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని ఓ మోడల్, బుల్లితెర నటి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ టీవీ నటి, నిందితుడు ముంబైలోని ఓ కాలేజీలో పరిచయమయ్యారు. అనంతరం సోషల్ మీడియా, ఫోన్‌లో సంభాషించుకుని మరింత దగ్గరయ్యారు. న్యూఢిల్లీలో ఉండే అతని తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని చెప్పి ఆ నటిని తన వెంట తీసుకెళ్లాడు.
తిరుగుప్రయాణంలో ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం పెళ్లి గురించి అడిగితే.. మొహం చాటేయడంతో.. మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment