
తూర్పుగోదావరి, పిఠాపురం: రాజమహేంద్రవరంలోని ఒక లాడ్జీలో ఓ మున్సిపల్ అధికారి, ఓ యువతితో కలిసి ఆదివారం రాసలీలలు జరిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆయన రెండు మున్సిపాలిటీలకు ముఖ్య అధికారి. వివిధ అవసరాల కోసం వచ్చిన మహిళలను తన అవసరాలకు వినియోగించుకోవడంలో ఆయన ఆరితేరారు. తన ఇంటి సరిహద్దు గోడ సమస్య కోసం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళపై కన్నేశాడు. ఆమె సమస్య పరిష్కారం కాకుండా రోజుల తరబడి తన చుట్టూ తిప్పుకునేలా చేశాడు.
చివరికి తన మనసులో మాట బయటపెట్టాడు. చివరకు తన కోరిక తీరిస్తే ఆ పని పూర్తవుతుందని తేల్చి చెప్పాడు. ఆమెను లొంగదీసుకుని కొంత కాలంగా ఆమెతో కామ కోరికలు తీర్చుకుంటున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆ మహిళతో పాటు మరో యువతిని తన వెంటబెట్టుకుని ఆ అధికారి రాజమహేంద్రవరం తీసుకువెళ్లినట్టు తెలిసింది. అక్కడ తన కారును ఓ ప్రభుత్వ కార్యాలయం వసతి గృహం వద్ద నిలిపి ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న లాడ్జీలోకి ఆ మహిళతో పాటు ఆ యువతిని తీసుకువెళ్లి అక్కడ రాసలీలలు కొనసాగించినట్టు పలువురు చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా వీరి కోసం మరో మున్సిపల్ కింది స్థాయి అధికారి గుర్తు తెలియని వ్యక్తి పేరున లాడ్జీరూం బుక్ చేసి సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆ అధికారి లోబరుచుకున్న మహిళతోపాటు వచ్చిన యువతిని.. మరో మున్సిపల్ ఉన్నతాధికారి కోసం తీసుకొచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment