దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్‌ రేప్‌ | Newly Married Woman Kidnapped Molested In Hapur District Of UP | Sakshi
Sakshi News home page

దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్‌ రేప్‌

Published Tue, Jan 21 2020 10:17 AM | Last Updated on Tue, Jan 21 2020 10:46 AM

Newly Married Woman Kidnapped Molested In Hapur District Of UP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో నవవధువుపై దారుణం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాతి రోజు ఉదయాన్నే సామూహిక లైంగికదాడికి గురైంది. హాపూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి ఓ యువకుడితో ఈ నెల 17న వివాహమైంది. అప్పగింతల తర్వాత ఆమెను అత్తారింటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత రోజయిన జనవరి 18న యువతి కనిపించకుండా పోవడంతో అందరూ కంగారుపడ్డారు. ఇంటి నిండా చుట్టాలతో కళకళలాడుతున్న సమయంలో ఆ యువతి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందారు.

చదవండి: ఆరునెలలు వెంటపడ్డాడు.. తిరస్కరించిందన్న కోపంతో

గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం హాపూర్‌లోని ఓ బ్యాంకు కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఇంటి నుంచి కిడ్నాప్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై సామూహిల లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement