newly married women
-
పెళ్లైన 13 రోజులకే.. సచివాలయ ఉద్యోగి బలవన్మరణం
సాక్షి, అనంతపురం క్రైం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులపై పెంచుకున్న మమకారం.. వారిని విడిచి ఉండలేని స్థితిలో కొట్టామిడుతూ చివరకు అర్ధంతరంగా తనువు చాలించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ ఆంజనేయ నగర్‌కు చెందిన సూర్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా సూర్యనారాయణ పనిచేస్తున్నారు. పెద్దమ్మాయి శ్రీసాయి సుజన (26) బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని సచివాలయం–2 (కొట్టాలపల్లి)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. చదవండి: (వివాహేతర సంబంధం.. రాత్రి 11:30 గంటలకు ప్రియుడికి అన్నం తీసుకెళ్లి..) నవంబర్ 17న చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన మెడికల్ రెప్రజెంటెటివ్ విశ్వనాథ్‌తో ఆమెకు వివాహమైంది. కొన్ని రోజుల పాటు అత్తింటిలో ఉండి వచ్చారు. ఈ క్రమంలోనే నవంబర్ 29న సాయంత్రం అత్తింటికి సాగనంపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులను వదిలి వెళ్లలేని మానసిక స్థితిలో కొట్టుమిట్టాడిన సుజన.. బాత్రూంకెళ్లి ఎంత సేపటికి బయటకు రాలేదు. తల్లిదండ్రులు పిలిచి చూశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికెళ్లి చూశారు. షవర్‌కు చున్నీతో ఉరి వేసుకున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా విలపించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్ఐ నబీరసూల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ప్రగతినగర్‌కు చెందిన కిరణ్‌కు సుధారాణి (22) అనే యువతితో నెల రోజుల క్రితమే వివాహమైంది. పెళ్లి తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్న కిరణ్ శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం తానూ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కిరణ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సుధారాణిని మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) -
నవవధువు అనుమానాస్పద మృతి
సాక్షి, బెంగళూరు: కరోనా కాలంలో కట్న పిశాచులు చెలరేగుతున్నారు. దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కసాఘట్ట గ్రామంలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది. 6 నెలల క్రితం మోనిషాను కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఒక్కతే కుమార్తె కావడంతో ఆమె తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించి కట్నకానుకలు భారీగా సమర్పించారు. కొన్నిరోజులకే మరింత డబ్బు తేవాలని భర్త వేధించసాగాడు. ఈ ఆరునెలల్లో పలుమార్లు డబ్బులు ఇచ్చామని అయితే తాము ఉంటున్న ఇల్లు కూడా రాసివ్వాలని ఒత్తిడిచేయడంతో మోనిషా పుట్టింటికి వచ్చేసింది. ఇటీవల పెద్దలు రాజీచేసి అత్తవారింటికి పంపారు. మంగళవారం ఉదయం ఫోన్‌చేసిన ముత్తేగౌడ మోనిషాకు ఫిట్స్ వచ్చి మరణించిందని చెప్పాడన్నారు. మోనిషాకు ఎప్పుడూ ఫిట్స్ రావని, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హత్యచేసి నాటకామాడుతున్నారని యువతి తల్లిదండ్రులు తెలిపారు. వారు ముత్తేగౌడ, తల్లి శారదమ్మ, తండ్రి శివకుమార్, చెల్లెలు సుధలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జీవితంపై విరక్తి.. నవవధువు ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: భర్త వేధింపులు తాళలేక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. నంద్యాల పట్టణంలోని మాల్దార్‌పేటకు చెందిన మనీషా (20) ఇంటర్ వరకు చదివింది. ఆమె తల్లిదండ్రులు తన చిన్నతనంలోని మృతి చెందడంతో మేనమామ మహేష్ వద్దనే ఉంటూ చదువుకుంది. ఈ ఏడాది జనవరిలో మనీషాకు పట్టణంలోని చింతరుగు వీధికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. కట్నంగా రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు ఇచ్చారు. రాజేష్ పట్టణంలో మెడికల్ రెప్రజెంటేటివ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం అనంతరం తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మనీషా సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి మేనమామ మహేష్ ఫిర్యాదు మేరకు మనీషా భర్త రాజేష్, కుటుంబీకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ ఓబులేసు మంగళవారం తెలిపారు. -
ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..
సాక్షి, భీమదేవరపల్లి: ‘అమ్మా.. నన్ను క్షమించండి, నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. నేను నా భర్తతో ఉండలేకపోతున్నా... ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా’అంటూ ఓ నవ వధువు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నారాయణగిరికి చెందిన మెడబోయిన రజాక్ కూతురు రవళికి భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన ఐలబోయిన రాజుతో ఈనెల 11వ తేదీన వివాహం జరిగింది. అయితే రవళి ఇంతకుముందే ఓ యువకుడిని ప్రేమించినా, తల్లిదండ్రుల ఒత్తిడితో రాజును వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవళి ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: (సఖి సెంటర్లో నవ వధువు ఆత్మహత్య) -
ఇష్టంలేని పెళ్లి.. నవవధువు బలవన్మరణం
సాక్షి, చిత్తూరు (కుప్పం): ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి అన్నదమ్ములు తమ బంధువులతో వరుడి ఇంటిపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. పోలీసుల కథనం..మండలంలోని మంకలదొడ్డికి చెందిన శ్రీనివాసులు కుమార్తె చైతన్య (22)కు కుర్మానుపల్లెకు చెందిన తంగవేల్ (24)కిచ్చి గత నెల 29న వివాహం చేశారు. చైతన్యకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని తంగవేల్ తన మామ శ్రీనివాసులుకు చెప్పాడు. చదవండి: (మైనర్‌పై పలుమార్లు అత్యాచారం..) ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున చైతన్య అత్తగారింట బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదే రోజు రెండు గ్రామాల పెద్దలు రాజీ చేసి మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ సోదరి మరణాన్ని జీర్ణించుకోలేక మృతురాలి అన్నదమ్ములు తమ బంధువులతో కలిసి శుక్రవారం తంగవేల్ ఇంటిపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఇది గ్రామంలో ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలపై కేసు సమోదు చేసినట్లు అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ నరేంద్ర తెలిపారు. తంగవేల్ ఇంటి వద్ద గొడవ చేస్తున్న మృతురాలి బంధువులు -
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య
అల్లారు ముద్దుగా పెంచిన కన్నకూతురు కాళ్ల పారాణి ఆరకముందే కడతేరిపోతుందని ఆ తల్లిదండ్రులు ఉహించలేదు. సంతోషం నిండాల్సిన ఆ ఇంటా విషాదం కుటుంబాన్ని కలచి వేస్తోంది. పెళ్లి ఇష్టం లేకో... లేక చదువు మధ్యలోనే ఆగిపోతుందనో... ఏమైనా ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కూతురి మరణాని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. సాక్షి, మండపేట: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని వై. సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆమె మృతి పెళ్లి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా మృతురాలు ఇటీవల లవ్ ఫెయిల్యూర్ కథనాంశంగా రూపొందించిన హరర్ షార్ట్ ఫిలిమ్‌లో ప్రధాన పాత్రలో నటించినట్టు సమాచారం. మండపేట రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వై. సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమ్య శ్రీదేవి (20) డిగ్రీ చదువుతోంది. రమ్య శ్రీదేవికి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన మేనమామతో బుధవారం తల్లిదండ్రులు వివాహం జరిపించారు. శనివారం ఆమెను అత్తవారి ఇంటికి పంపాల్సి ఉంది. కాగా శుక్రవారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తహసీల్దార్ సీహెచ్ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కాళ్ల పారాణి ఆరకముందే అఘాయిత్యానికి పాల్పడటంపై తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ పర్యవేక్షణలో రూరల్ హెచ్‌సీ మూర్తి కేసు నమోదుచేశారు. ఇష్టం లేని పెళ్లి కావచ్చని, లేదా చదువు ఆగిపోతుందన్న బాధతోనైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి ఫోన్ కాల్‌డేటా వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షార్ట్ ఫిల్మ్‌లో నటించిన రమ్య? మృతురాలు రమ్య ఇటీవల డార్క్ వేలంటైన్ షార్ట్ ఫిల్మ్‌లో హీరోయిన్గా నటించినట్టు తెలిసింది. లవ్ ఫెయిల్యూర్ ప్రధానాంశంగా రూపొందించిన ఈ హరర్ షార్ట్ ఫిల్మ్ 2వ తేదీన విడుదల కానున్నట్టు సమాచారం. కాగా ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్ రేప్
లక్నో: దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో నవవధువుపై దారుణం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాతి రోజు ఉదయాన్నే సామూహిక లైంగికదాడికి గురైంది. హాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఠానా దేహాట్ ప్రాంతానికి చెందిన యువతికి ఓ యువకుడితో ఈ నెల 17న వివాహమైంది. అప్పగింతల తర్వాత ఆమెను అత్తారింటికి తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత రోజయిన జనవరి 18న యువతి కనిపించకుండా పోవడంతో అందరూ కంగారుపడ్డారు. ఇంటి నిండా చుట్టాలతో కళకళలాడుతున్న సమయంలో ఆ యువతి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందారు. చదవండి: ఆరునెలలు వెంటపడ్డాడు.. తిరస్కరించిందన్న కోపంతో గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం హాపూర్‌లోని ఓ బ్యాంకు కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఇంటి నుంచి కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై సామూహిల లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు. -
నవవధువు అపహరణ
హైదరాబాద్: వారం రోజుల కిందట హైదరాబాద్ లో ప్రేమ వివాహం చేసుకున్న నవవధువు అనూహ్య రీతిలో అపహరణకు గురైంది. శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నవవధువు గౌతమి (25) కనిపించకుండా పోయిందని వరుడు శివకృష్ణ(24) హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18న జీడిమెట్లలోని ఆర్యసమాజ్ లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా, గౌతమిని ఆమె కుటుంబ సభ్యులే అపహరించి ఉంటారని భర్త శివకృ ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పెళ్లైన మూడు రోజులకే వధువు ఆత్మహత్య
ఖమ్మం క్రైం : పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది.. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంనకు చెందిన భాస్కర్‌రావు ఖమ్మంలోని శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు మమతకు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన దోసపాటి గణపతిరావుతో ఈనెల 11నవివాహం జరిగింది. 12న నందిగామలో సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోని అదేరోజు రాత్రి ఖమ్మం వచ్చారు. శనివారం తెల్లవారుజామున మమత ఇంట్లో కనిపించలేదు. కాగా, వెంకటగిరి గేట్ ప్రాంతంలో రైలు కిందపడి ఎవరో మృతి చెందారని స్థానికులు అనుకోవడం విని, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా పట్టాలపై మమత మృతదేహం కనిపించింది. మమత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావటం లేదని, ఆమె ఇష్టంతోనే ఈ వివాహం చేశామని భాస్కరరావు చెప్పారు. ఇదిలా ఉండగా మమత అత్తారింటికి వెళ్లినప్పుడు దంపతుల మధ్య వివాదం జరిగి ఉంటుందని, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు. -
అత్తవారింట నవ వధువు ఆత్మహత్య
అల్వాల్ (హైదరాబాద్): ఓ ప్రేమ జంట పెద్దల అంగీకారంతో రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. ఇంతలోనే నవ వధువు అనుమానస్పద స్ధితితో అత్తవారింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం....నిజామాబాద్ జిల్లా భోదన్‌కు చెందిన వెంకటేశ్వరరావు, మోహిణి దంపతుల కుమార్తె లాస్యప్రియ (26), కేరళకు చెందిన అభిషేక్ (27) నగరంలో ఎంబీఏ చదువుతూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 27న వివాహం చేసుకున్నారు. అల్వాల్‌లోని పంచశీల కాలనీలో కలసి ఉంటున్నారు. అయితే, బుధవారం ఉదయం లాస్య తాను నిద్రించిన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు లాస్యప్రియ తండ్రికి ఫోన్ చేసి తెలిపారు. పంచశీల కాలనీకి చేరుకున్న లాస్యప్రియ తల్లిదండ్రులు తమ కుమార్తెను అభిషేక్ కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న లాస్య ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం లేదని పేర్కొన్నారు. వరకట్నం గురించి అభిషేక్ కుటుంబ సభ్యులు వత్తిడి తెచ్చేవారని ఈ క్రమంలోనే లాస్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.