ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, అనంతపురం క్రైం: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులపై పెంచుకున్న మమకారం.. వారిని విడిచి ఉండలేని స్థితిలో కొట్టామిడుతూ చివరకు అర్ధంతరంగా తనువు చాలించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ ఆంజనేయ నగర్‌కు చెందిన సూర్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా సూర్యనారాయణ పనిచేస్తున్నారు. పెద్దమ్మాయి శ్రీసాయి సుజన (26) బుక్కరాయసముద్రం పంచాయతీ పరిధిలోని సచివాలయం–2 (కొట్టాలపల్లి)లో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
చదవండి: (వివాహేతర సంబంధం.. రాత్రి 11:30 గంటలకు ప్రియుడికి అన్నం తీసుకెళ్లి..)
నవంబర్ 17న చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన మెడికల్ రెప్రజెంటెటివ్ విశ్వనాథ్‌తో ఆమెకు వివాహమైంది. కొన్ని రోజుల పాటు అత్తింటిలో ఉండి వచ్చారు. ఈ క్రమంలోనే నవంబర్ 29న సాయంత్రం అత్తింటికి సాగనంపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులను వదిలి వెళ్లలేని మానసిక స్థితిలో కొట్టుమిట్టాడిన సుజన.. బాత్‌రూంకెళ్లి ఎంత సేపటికి బయటకు రాలేదు. తల్లిదండ్రులు పిలిచి చూశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్ధలు గొట్టి లోపలికెళ్లి చూశారు. షవర్‌కు చున్నీతో ఉరి వేసుకున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా విలపించారు. సమాచారం అందుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్‌ఐ నబీరసూల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment