తిరువనంతపురం: కేరళ బిషప్ ప్రాంకో ములక్కల్..నన్(క్రైస్తవ సన్యాసిని)పై పలుమార్లు లైంగికదాడి పాల్పడిన ఆరోపణల కేసులో గతేడాది అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం బిషప్ కేసు పిటిషన్ విచారణ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సప్‌లో కాల్‌లో అసభ్య పదజాలంతో తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు తెలిపారు. అంతేగాక బలవంతంగా ముద్దులు పెట్టాడని కోర్టుకు విన్నవించారు. ఈ విషయాల గురించి బాధితురాలు మాట్లాడుతూ ‘నేను బిషప్‌ను మొదటి సారిగా 2015 బిహార్‌లో కలిశాను. కాన్వెంట్‌కు సంబంధించిన విషయాలను గురించి తరచూ ఆయనతో వాట్సప్ వీడియో కాల్, ఫోన్ కాల్స్ మాట్లాడేదాన్ని. వాట్సప్‌లో చాటింగ్ కూడా చేసేదాన్ని. ఇలా 2015 నుంచి 2017 వరకు మాట్లాడాను. మొదట్లో బాగానే మాట్లాడేవాడు. ఇక 2015 ఏడాది చివరిలో ఆయన మాటల్లో క్రమంగా తేడాను గమనించాను. నన్‌ని అని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో మాట్లాడూతూ వేధించడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో కొన్ని కారణాలు వల్ల నేను కేరళకు వెళ్లాల్సివచ్చింది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బిషప్ ములక్కల్ నన్ను తన రూంకు పిలిచి బిహార్ నుంచి కేరళకు రావడానికి గల కారణాలపై ఆరా తీశాడు. నేను ఆయనకు వివరించాను. ఇలా రెండుగంటల పాటు మాట్లాడుకున్నాక నేను వెళ్లిపోతున్న క్రమంలో నన్ను వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌలిగించుకుని బలవంతంగా ముద్దులు పెట్టాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వాట్సప్ వీడియో కాల్స్‌లో తన శరీర భాగాలు, నా దేహంలోని భాగాల గురించి మాట్లాడాడని భాధితురాలు వాగ్మూలంలో పేర్కొన్నారు.
నన్‌పై లైంగిక దాడి : బిషప్‌పై బాధితురాలు ఫైర్
‘‘బిషప్ ములక్కల్ డియోసెస్ అధికారి కావడంతో చర్చి నుంచి పంపించేస్తారన్న భయంతో ఆయనపై వెంటనే ఫిర్యాదు చేయలేకపోయాను. ఒకవేళ బయటకు చెబితే ఏదైనా హాని తలపెడతాడమోనన్న భయంతో ఆయన ఆరాచాకాలను మౌనంగా భరించాల్సి వచ్చేది’’ అంటూ నన్ వాపోయారు. కాగా ములక్కల్.. తనపై పలుమార్లు అత్యాచారం చేశారని కొట్టాయం కాన్వెంటుకు చెందిన ఓ నన్ ఆరోపించడంతో రెండేళ్ల కింద కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదు మేరకు బిషప్‌ను పోలీసులు అరెస్ట్ చేసి 2019లో చార్జిషీటు దాఖలు చేశారు. కాగా మరో నన్ కూడా సదరు బిషప్.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment