
కోజికోడ్: ఆ యువతికి మతిస్థిమితం లేదు.. తాను ఇంటికి వెళ్లాలని రోడ్డు మీద వాహనాలను లిఫ్ట్ ఇవ్వమని అడిగింది. ఈ క్రమంలో ఆమె మీద ఓ ముగ్గురు వ్యక్తుల కన్ను పడింది. వారు ఆ యువతికి లిఫ్ట్ ఇచ్చి ఓ ప్రైవేటు బస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికొడ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. కేరళలోని కోజికొడ్ జిల్లాకు చెందిన 21ఏళ్ల ఓ యువతికి మతిస్థిమితం లేదు. ఆ యువతి తరచు తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వస్తుంది.
అయితే జూలై 5న మరోసారి తన తల్లితో గొడవపడి ఊరి చివరకు వెళ్లింది. కొంత సమయం తర్వాత తాను ఇంటికి వెళ్లాలనుకొని రోడ్డుపై పలు వాహనాలను లిఫ్ట్ అడిగింది. ఆమెను గమనించిన ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్ ఇచ్చి ఇంటి వద్ద దింపుతామని బలవంతంగా ఓ ప్రైవేటు బస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను ఊరిలోని ఆటో స్టాండ్ వద్ద వదిలేసి పరారయ్యారు.
అయితే జరిగిన విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని చేవాయూర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment