కోల్‌కతా : ఇంగ్లీష్ అర్థం కావడం లేదని ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంపతి అనే విద్యార్థిని కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. మొదటినుంచి బెంగాలీ భాషలోనే విద్యనభ్యసించిన సంపతి నర్సింగ్ కోర్సు ఆంగ్ల మాద్యమంలో ఉండేసరికి చదువు అర్థంకాక మనోవేదనకు గురయ్యేది. అయితే ఇటివలే దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన సంపతి చదువు ఆపేస్తానని చెప్పినా తండ్రి నచ్చచెప్పి తిరిగి కాలేజీకీ పంపించాడు. అయితే చదువుకు సంబంధించి రూ. 5లక్షలు రూపాయలు తండ్రి నుంచి తీసుకువచ్చిన సంపతి మరింత ఆందోళనను పెంచుకుంది.
ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురైన సంపతి హాస్టల్‌లోని తన రూంలో ఎవరు లేని సమయంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శనివారం తోటి స్నేహితులు వచ్చి సంపతి రూం తలుపు కొట్టినా ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానంవచ్చి చూడగా ప్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. దీంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకొని సంపతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సందర్భంగా సంపతి రాసిని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ' ఎంతో ఇష్టపడి జాయిన్ అయిన నర్సింగ్ కోర్సు ఇంగ్లీష్‌లో ఉండడంతో నాకు అర్థం కావడం లేదు. అలాగే నా తండ్రి చదువు పేరుతో రూ.5 లక్షలు పంపినా నేను న్యాయం చేయలేకపోతున్నా. అందుకే చనిపోవాలని నిర్ణయించుకఘాన్న' అని లేఖలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment