వృద్ధుడి పైశాచికం | old men sexual assult on children | Sakshi
Sakshi News home page

వృద్ధుడి పైశాచికం

Published Wed, Dec 6 2017 12:15 PM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM

old men sexual assult on children - Sakshi

గుంటూరు ఈస్ట్‌: కామంతో కళ్లు మూసుకుపోయి పసిపిల్లలపై పశువులా ప్రవర్తించాడు ఓ వృద్ధుడు. తన నలుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపిన మానవమృగం అభం శుభం తెలియని బాలికలపై లైంగిక దాడి చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో బాలికల తల్లిదండ్రులు గుంటూరులోని లాలాపేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరులోని లాలాపేట చిన్నబజారుకు చెందిన జానీ బాషా అనే వృద్ధుడు పెళ్లి సంబంధాలు కుదుర్చే మధ్యవర్తిగా జీవనం సాగించేవాడు. భార్య చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. నవంబర్‌ నెలాఖరున తన ఇంటికి సమీపంలో ఆడుకునే 3 నుంచి 4 ఏళ్లు ఉన్న ముగ్గురు బాలికలకు జానీ బాషా మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు.

సెల్‌ఫోన్‌లో వారికి నీలి చిత్రాలు చూపించి అదే విధంగా బాలికలతో వ్యవహరిం చాడు. ఈ విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పవద్దని బెదిరిం చాడు. ఆది వారం ఓ బాలిక కడుపులో నొప్పగా ఉందని బాధపడుతుండటంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం తెలి సింది. సమీప బంధువులైన మరో ఇద్దరి బాలికలతోనూ అదే విధంగా ప్రవర్తించాడని బాలిక తల్లితో చెప్పిం ది. సోమవారం ఆ కామాంధుడు లాలాపేట చిన్నబజా రులో ఉన్నాడని తెలుసుకుని బాలి కల తల్లిదండ్రులు వెళ్లి అతడిని నిలదీశారు. అదే సమయంలో జానీ బాషా బంధువులు వచ్చి అతనిని తీసుకెళ్లిపోయారు. దీంతో వారు లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల నుంచి బాలలను రక్షించే చట్టం (పోక్సో) కింద జానీ బాషాపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement