
సాక్షి, బనశంకరి: సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, మానవ హక్కుల పోరాటయోధుడు గోవింద్‌పన్సారే హత్యకు వినియోగించిన రివాల్వర్‌నే గౌరీలంకేశ్ హత్యకు వినియోగించినట్లు ల్యాబొరేటరీ పరిశోధనల్లో రుజువైంది. కలుబురిగి, పన్సారే హత్యకు స్వదేశంలో తయారైన 7.65 ఎంఎం.రివాల్వర్ ద్వారా కాల్పులు జరిపి హత్యకు పాల్పడ్డారు.
బెంగళూరు రాజరాజేశ్వరినగరలో తన ఇంటి వద్ద గౌరీని కూడా అదే రివాల్వర్‌కు బలయ్యారు. ముగ్గురు ఒకే తరహాలో హత్యకు గురికావడంతో హంతకులు ఒకే సంస్థకు చెందిన వారు కావొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 5న రాజరాజేశ్వరి నగరలో గౌరి హత్యకు గురయ్యారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బుల్లెట్లను హైదరాబాద్, బెంగళూరుల్లోని ల్యాబ్‌కు పంపించారు. నివేదికలో గతంలో సాహితీవేత్త ఎంఎం.కలుబురిగి, గోవింద్‌పన్సారేపై కాల్పులు జరిపిన రివాల్వర్‌తోనే గౌరిపై కూడా కాల్పులు జరిపినట్లు పరిశోధనలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment