సాక్షి, ఒంగోలు : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలొ ప్రకాశం జిల్లా వాసి మృతి చెందాడు... ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెం చెందిన చింతల శివతేజ (26) మృతి చెందాడు. కొమ్మినేనివారిపాలెం చెందిన చింతల రామాంజనేయులు వెంకటరత్నంకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడో కుమారుడు శివతేజ బీటెక్ పూర్తి చేసి ఆరేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరాడు.
గత ఆదివారం మధ్యాహ్నం రవితేజ మరో యువతితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా అది అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రవితేజ అక్కికక్కడే మృతి చెందగా, యువతి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని కారులో ఉన్న యువతి కుటుంబసభ్యులు అమెరికాలోని రవితేజ సోదరికి సమాచారమిచ్చారు. అమెరికాలోనే స్థిరపడ్డ శివతేజ సోదరి ప్రియాంక ద్వారా మంగళవారం సమాచారం అందుకున్న కొమ్మినేనిపాలెంలోని రవితేజ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రవితేజ చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. రవితేజ భౌతిక కాయం స్వస్థలానికి వచ్చేసరికి మరో రెండురోజులు పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment