
సీసీ పుటేజీలో కనిపిస్తున్న దుండగుడు
నిజామాబాద్,ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట్ శివారులో ప్రవీన్ ఫిల్లింగ్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 3గంటలకు కారులో పెట్రోలు బంక్‌లోకి ప్రవేశించిన దుండగుడు పంపులో పనిచేసే వ్యక్తులు నిద్రిస్తున్న సమయంలో రూంలోకి ప్రవేశించి బీరువా తాళాలను పగులగొట్టే ప్రయత్నం చేయగా బీరువా తాళాలు పగలకపోవడంతో అక్కడే ఉన్న స్వైపింగ్ మిషిన్ ఇన్వెర్టర్, బంకులో పనిచేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను దొంగలించాడు.
ఇది తెలిసిన పెట్రోల్ పంపులో పనిచేసే వ్యక్తులు యజమాని ప్రవీన్‌కు సమాచారం ఇవ్వడంతో సీసీ పుటేజీలు పరిశీలించిన అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి ఉదయం 3గంటలకు రూంలోకి ప్రవేశించి దొంగతనం చేశాడని గుర్తించారు. ఈ విషయమై ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపారు.