
సాక్షి, నెల్లూరు : నగరంలో భారీ చోరీ జరిగింది. వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 25 లక్షల రూపాయల నగదు మాయం చేశారు. ముసుగు వేసుకుని, చేతులకు కవర్లు కట్టుకుని పక్కా పథకం ప్రకారం చోరీ చేశారు. రెండు లాకర్లలో ఒక లాకర్ని పగుల కొట్టి అందులోని డబ్బు దోచుకెళ్లారు. దొంగలు రాత్రంతా షాపింగ్ మాల్‌లోనే ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. కాగా షాపింగ్ మాల్ యాజమాన్యం ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment