
కామారెడ్డి క్రైం: కండెక్టర్ అవమానించాడని మనస్తాపానికి లోనైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కామారెడ్డి డిపోలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన సుతారి శ్రీనివాస్ బుధవారం విధుల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లాడు. సాయంత్రం జూబ్లీ బస్టాండ్ నుంచి కామారెడ్డికి తిరిగి వస్తుండగా మేడ్చల్ సమీంలో మేడ్చల్ డిపోలో కండక్టర్‌గా పనిచేసే సిద్దిరాములు బస్సు ఎక్కి రామాయంపేట వద్ద దింపాలన్నాడు. నాన్‌స్టాప్ బçస్సు అయినందున అక్కడ ఆపడం కుదరదని శ్రీనివాస్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి లోనైన శ్రీనివాస్ కామారెడ్డికి వచ్చిన అనంతరం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి ఉద్యోగులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment