బద్వేలులో సవతి తండ్రి దారుణం | Step Father Molestation on Daughter in Badvel YSR Kadapa | Sakshi
Sakshi News home page

కనురెప్ప కాటేసింది

Published Tue, Jan 7 2020 12:39 PM | Last Updated on Tue, Jan 7 2020 12:39 PM

Step Father Molestation on Daughter in Badvel YSR Kadapa - Sakshi

బద్వేలు అర్బన్‌ : కంటికి రెప్పలా కూతురిని కాపాడాల్సిన ఓ సవతి తండ్రి కామాంధుడిలా మారాడు. బద్వేలు పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ..తమిళనాడుకు చెందిన చిత్ర అనే ఓ మహిళకు 15 ఏళ్లక్రితం అక్కడే ఓ వ్యక్తితో వివాహమైంది. ఏడాది తర్వాత చిత్ర గర్భవతిగా ఉన్న సమయంలో భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చిన చిత్ర నెలల పాపతో జిల్లాలోని ప్రొద్దుటూరుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ సమయంలో బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.ఇరువురు బద్వేలులోని సుందరయ్యకాలనీ సమీపంలోని ఓ ఇంటిలో సహజీవనం చేస్తూ అక్కడే ఉన్న ఓ కొబ్బరిపీచు తయారు చేసే పరిశ్రమలో పనిచేస్తుండేవాడు. 

బాలకృష్ణ కూతురు లాంటి బాలిక(14)పై కన్నేశాడు. చిత్రను బెదిరించి బాలికతో తనకు వివాహం జరిపించాలని వేధిస్తుండేవాడు. కొన్ని రోజులుగా మైనర్‌ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వస్తున్న బాలకృష్ణ ఆదివారం రాత్రి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తెలిసింది. భయభ్రాంతులకు గురైన బాధిత బాలిక ఇంటికి వెళ్లే సాహసం చేయక సమీపంలోని ముళ్లపొదల్లో దాక్కుంది. స్థానికులు గుర్తించి ఆరా తీయగా విషయం చెప్పింది. దీంతో స్థానికులు అర్బన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ రమేష్‌బాబు, రూరల్‌ ఎస్‌ఐ లలిత, ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో బాలికను విచారించారు. సవతి తండ్రిపై ఐపీసీ 376, సెక్షన్‌ 4ఆఫ్‌ఫోక్సోయాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement