సాక్షి, విజయవాడ: పోలీసులు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న చిట్టూరి మురళి ఆర్థిక ఇబ్బందులు కారణంగా పగలు కళాశాలకు వెళ్ళి చదువుకుంటూ..రాత్రి పూట టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గన్నవరం ఎస్‌ఐ నారాయణమ్మ భర్త బైక్ మీద వెళ్తుండగా..మురళి ఎదురుగా రావడంతో ఒకరినొకరు ఢీ కొన్నారు. దీంతో మురళీని స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు ప్రశ్నించగా, తీవ్ర మనస్తాపం చెందిన మురళీ.. గన్నవరం కోనాయిచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఎస్‌ఐ నారాయణమ్మ మానసికంగా వేధించినట్లు, తన చావుకు ఎస్‌ఐ కారణమంటూ స్నేహితుడికి మురళీ చివరిగా చేసిన ఫోన్‌కాల్‌లో చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నా కుమారుడు మృతికి పోలీసులు కారణం కాదు..
అయితే తన కుమారుడు మురళి మృతికి పోలీసులు కారణం కాదని మృతుడి తల్లి పార్వతి తెలిపారు. పోలీసులతో చాలా లౌక్యంగా ఉంటాడని చెప్పారు. ఇక విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సిఐ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. మృతుడు మురళీని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించింది వాస్తమేనని, రాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఎస్‌ఐ భర్త బైక్‌ను ఢీ కొట్టడంతో పిలిచి విచారణ జరిపామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment