సిగరెట్‌ వివాదం.. పోలీసుల దాడి..! | Tukaram Gate Police Attacks On Accused In Hyderabad | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ వివాదం.. పోలీసుల దాడి..!

Published Wed, Jun 5 2019 11:22 AM | Last Updated on Wed, Jun 5 2019 12:15 PM

Tukaram Gate Police Attacks On Accused In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓ యువకుడిని చితకబాదారు. పోలీస్‌స్టేషన్‌ తీసుకెళ్లి ఓ యువకుడిపై దాడి చేసి గాయపర్చారు. వివరాలు.. తుకారాంగేట్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీసులు అక్కడను చేరుకుని యువకుల్ని స్టేషన్‌కు తరలించారు. సాయిగౌడ్‌ అనే యువకుడిని చితకబాదారు. దీంతో అతని నోటి నుంచి తీవ్ర రక్తస్రావమైంది. అక్కడే ఉన్న ఉన్న యువకుడి స్నేహితులు ఇదంతా వీడియోలో చిత్రీకరించడంతో.. పోలీసులు అతడిని విడిచిపెట్టారు. అకారణంగా తనను ఎస్‌ఐ రామ్‌లాల్‌, కానిస్టేబుల్‌ నాయక్‌ కొట్టారని, తాను కనీసం మద్యం కూడా తాగలేదని సాయి వాపోయాడు. ఇదిలాఉండగా.. ఓ సిగరెట్‌ వివాదంలో సదరు యువకుడు పోలీసులతో అతిగా స్పందించినట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement