వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి, పక్కన ఏసీపీ, ఎస్‌ఐలు
తుర్కపల్లి(ఆలేరు) : ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు.. మచ్చుకైన లేడు చూడు మనవత్వం ఉన్న వాడు’ అని ఓ కవి అన్న మాట నూటికి నూరుపాళ్లు నిజమనిపిస్తుందని ఈ ఘాతుకాన్ని చూస్తే. ఆస్తి కోసం మానవత్వం మరిచి రక్తం పం చుకుపుట్టిన అన్నను, భుజాల మీద ఎత్తుకుని పెం చిన నాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఆస్తి ని దక్కించుకునేందుకు వరుస హత్యలు చేస్తున్న నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశా రు.
హత్యలు చేయడానికి గల కారణాలను డీసీపీ రామచంద్రారెడ్డి విలేకరులకు వెల్లడించారు.తుర్కపల్లి మండలం గొల్లగూడెం పం చాయతీ పరిధిలోని మర్రికుంటతండాకు చెందిన ధారవత్ జాలంనాయక్ (60) జనగామ జిల్లా నర్మెట్ట మండలం మలక్‌పేటతండాకు చెందిన సుగుణను మూడు దశాబ్దాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు భిక్షపతి, నర్సింహనాయక్ ఉన్నారు.
కొద్దిరోజులకు సుగుణ ఆరోగ్య పరిస్థితి బాగులేకుంటే తన సొంతచెల్లెలు లక్ష్మీని తన భర్త జాలం కిచ్చి వివాహం చేసింది. లక్ష్మికి కూడా ఓ కొడుకు నరేందర్‌నాయక్ పుట్టా డు. కొన్నేళ్లకు సుగుణ ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడింది. క్రమంగా లక్ష్మిపై జాలం నిర్లక్ష్యం చేశాడు. దీంతో లక్ష్మి తండాలోనే వేరుగా ఉందా మని, మరో ఇల్లు కట్టుకుందామని జాలంకు చెప్పగా సహకరించకలేదు. దీంతో లక్ష్మి తన తల్లిగారింటికి (మలక్‌పేట తండాకు) కొడుకు నరేందర్‌నాయక్‌ను తీసుకుని వెళ్లిపోయింది.
ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని..
జాలంకు ఉన్న 12 ఎకరాల పొలాన్ని పెద్ద భార్య కొడుకు భిక్షపతినాయక్, నర్సింహనాయక్, భార్యపైన రిజిస్టర్ చేశాడు. చిన్నభార్య లక్ష్మి, ఆమె కొడుకుపై రిజిస్టర్ చేయలేదు. దీంతో లక్ష్మి, నరేందర్‌నాయక్ జాలంతో పలుమార్లు భూమి విషయంలో గొడవ పడ్డారు. ఇదేక్రమంలో నరేందర్‌నా యక్ తుర్కపల్లి మండలం రాంపూర్‌తండాకు చెం దిన అమ్మాయి సునీతను ప్రేమించాడు.
పెళ్లికో వాలని నిర్ణయించుకుని పెద్దల అంగీకారం కూడా కుదుర్చుకున్నాడు. తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో భాగం ఇస్తానని జాలం పట్టుబట్టాడు. నరేందర్ మాట వినకుండా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది.
నాలుగేళ్ల క్రితం అన్న హత్య
తనకు ఆస్తి దక్కకుండా అన్న నర్సింహనాయక్ అడ్డుపడుతున్నాడని అతనిపై పగ పెంచుకున్నా డు. నరేందర్‌నాయక్ మలక్‌పేట తండాలో డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు అన్న నర్సింహనాయక్ కది లికలపై కన్నేశాడు. తన మేన బావమరిది భగవన్ సహకారంతో నాలుగేళ్ల క్రితం పక్కా ప్లాన్‌తో మో టార్ సైకిల్‌పైన వచ్చి గొల్లగూడెం సమీపంలో మోటర్ సైకిల్‌పైన వెళ్తున్న నర్సింహనాయక్‌ను వెంబడించి కత్తులతో దాడి చేసి చంపేశారు. పోలీసులు నర్సింహనాయక్‌ను అరెస్ట్ చేసి కో ర్టులో హాజరుపరిచారు. కొన్ని రోజులు జైల్లో ఉం డి బెయిల్‌పై విడుదలయ్యాడు. నాలుగేళ్లనుంచి పేషీపై భువనగిరి కోర్టుకు హాజరవుతున్నాడు.
అడ్డు తొలగించాలని..
జాలం పెద్దభార్య సుగుణ చిన్నకొడుకు నర్సింహనాయక్ హత్య అనంతరం చిన్నభార్య లక్ష్మి, అతని కొడకు నరేందర్‌నాయక్ మధ్య భూ వివాదాలు కొలిక్కిరాకపోవడంతో పాటు వివాదాలు పెరి గాయి. ఆస్తిలో తన తండ్రి భాగం ఇవ్వడం లేదని నరేందర్‌నాయక్ తండ్రి పైన కూడా కసిని పెంచుకున్నాడు. ఎలాగైనా తండ్రిని జాలంను మట్టుపెడితే అడ్డు ఉండదని నిర్ణయించుకున్నాడు.
సినిమా ఫక్కీలో మర్డర్ ప్లాన్
కోర్టు కేసుకు వచ్చినప్పుడు కూడా నరేందర్‌నాయక్‌కు జాలం తారసపడేవాడు. ఎలాగైనా తండ్రిని ఆంతం అంతమొందించాలని ఎదురు చుస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం(ఈనెల 23న) కోర్టు కేసుకు వచ్చివెళ్లాడు. ఆ రోజు తండ్రి జాలం కోర్టుకు హాజరు కాలేదు. తిరిగి మంగళవారం తన లాయర్ కలవడానికి నరేందర్‌నాయక్ తన టాటాసుమో వాహనంలో వచ్చాడు. జాలం తన పెద్ద భార్య కొడుకు భిక్షపతికి పింఛన్ విషయమై వేర్వేరు మోటారు సైకిళ్లపై భువనగిరికి వచ్చారు.
భువనగిరి కోర్టులో ఉన్న నరేందర్‌నాయక్ తం డ్రిని చూశాడు. జాలం భువనగిరి నుంచి టీవీఎస్ ఎక్సెల్‌పై ఇంటికి వస్తుండగా అక్కడి నుంచి నరేం దర్‌నాయక్ టాటాసుమోలో వెంబడిస్తూ రుస్తాపూర్ గ్రామశివారులో వెనక వైపు నుంచి సుమోతో బలంగా ఢీకొట్టాడు. రోడ్డు పైన పడిపోయిన జాలంకు తీవ్రగాయాలయ్యాయి. మరోమారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మరణించాడని తెలుసుకుని తన టాటా సుమోతో తుర్కపల్లి పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. రెండు హత్యలు చేసిన నిందుతుడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ సముద్రాల శ్రీనివాసాచార్యులు, సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ వెంకటేశం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment