
డ్రైవర్ జోసెఫ్ (ముసుగులో ఉన్న వ్యక్తి)తో డోన్ పోలీసులు
డోన్: కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఈ నెల 11న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్ వోల్వో బస్సు డ్రైవర్ జోసెఫ్‌ను అరెస్టు చేసినట్లు డోన్ డీఎస్పీ ఖాదర్‌బాష తెలిపారు. శుక్రవారం డోన్‌లోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ఈ ప్రమాదంలో బైక్, తుపాను వాహనాన్ని వోల్వో బస్సు ఢీకొట్టడంతో మొత్తం 17 మంది చనిపోయారని గుర్తుచేశారు. ఇందుకు కారణమైన బస్సు డ్రైవర్ కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాల్ టౌన్‌కు చెందిన జోసెఫ్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇదే కేసులో ఇప్పటివరకు 63 మందిని విచారించినట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్ ట్రావెల్స్, బస్సుల తయారీ సంస్థ అయిన స్కానియాలకు నోటీసులిచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment