
సాక్షి, వైఎస్సార్: కడపలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని గౌసియా అనే మహిళను ఆమె భర్త ఇంట్లో బంధించాడు. గౌసియాకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పట్టకపోవడంతో భర్త మరో వివాహం కూడా చేసుకున్నాడు. తన మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని బూత్ బంగ్లా లాంటి ఇంట్లో ఒంటరిగా బంధించాడు. భర్త బంధించడంతో గతకొద్ది రోజులుగా ఆమె చీకటి జీవితం అనుభవిస్తోంది.
విషయం తెలుసుకున్న గౌసియా కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.