
తుమకూరు: ప్రేమవివాహం చేసుకున్న ఏడేళ్ల అనంతరం కులం పేరుతో దూషిస్తూ భర్త, కుటుంబ సభ్యులు మహిళను ఇంట్లోంచి గెంటేసిన ఘటన పట్టణంలోని సిద్దేమణ్ణినపాళ్యలో శుక్రవారం వెలుగు చూసింది. పట్టణానికి చెందిన వేర్వేరు కులాలకు చెందిన రాధా, ఉమేశ్‌లు ఏడేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
అయితే వేరే కులానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని ఉమేశ్ కుటుంబ సభ్యులు ఉమేశ్‌ను కూడా తమవైపు తిప్పుకొని గత కొద్ది కాలంగా రాధాను వేధించసాగారు. అయితే వీటిన్నింటిని రాధా లెక్కచేయకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఉమేశ్ అతడి కుటుంబ సభ్యులు రాధను ఇంట్లోంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తమకు న్యాయం చేయాలంటూ ఉమేశ్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది.