ఆటోను ఢీకొన్న కారు | Woman Injured in Car And Auto Accident | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న కారు

Published Fri, Nov 9 2018 12:36 PM | Last Updated on Fri, Nov 9 2018 12:36 PM

Woman Injured in Car And Auto Accident - Sakshi

ఘటనా స్థలిలో దెబ్బ తిన్న ఆటో, కారు

గుంటూరు, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : మండల పరిధి లోని జాతీయ రహదారిపై నవాబుపేట క్రాస్‌ రోడ్స్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందర్లపాడుకు చెంది న ఏడుగురు మహిళలు ఆటోలో నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లా రు. తిరుగు ప్రయాణంలో నవాబుపేట క్రాస్‌ రోడ్స్‌ వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు మార్జిన్‌ బ్యారికేడ్‌పైకి ఆటో దూసుకెళ్లింది. దానిలో ప్రయాణిస్తున్న కస్తాల చిననాగమ్మ, వేల్పుల రాణి, గజ్జల కుమారి, మార్కపూడి మరియమ్మ, కస్తాల నాగమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న బాపులపాడుకు చెందిన ముగ్గురికి గాయాలవలేదు.క్షతగాత్రులను 108 వాహనంలో నంది గామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ అవి నాష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement