
మృతిచెందిన బంగారమ్మ
కొత్తవలస విజయనగరం : అనకాపల్లి నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కొత్తవలస జంక్షన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సబ్బవరం రోడ్డు గవరపాలెంనకు చెందిన మాదాబత్తుల బంగారమ్మ (62) బజారు పనిమీద కొత్తవలస జంక్షన్‌లో రోడ్డు దాటుతుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బంగారమ్మను విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గవరపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు నెలల ముందే తండ్రి మృతి చెందగా.. ఇప్పుడు తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. కొత్తవలస హెచ్‌సీ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment