అశోక్ మృతదేహం
మల్దకల్ (గద్వాల) : గ్రామ దేవతల ఉత్సవాలకు వచ్చిన ఓ యువకుడు సరదాగా గ్రామ సమీపంలో ఉన్న బావి వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన గురువారం మల్దకల్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్దకల్‌కు చెం దిన మంగళి నారాయణ గ్రామంలో సవారమ్మ దేవత ఉత్సవాలు ఉండడంతో అయిజలో ఉన్న బంధువులు మంగళి లక్ష్మన్న, సుజాతలను ఉత్స వాలకు ఆహ్వానించారు. దీంతో వారు తమ కుమారుడు అశోక్(19), కూతురుతో కలిసి మల్దకల్‌కు చేరుకున్నారు. ఈ మేరకు బుధవారం ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. గురువారం ఉదయం అశోక్ కొందరు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న గడియాల తిమ్మ య్య వ్యవసాయ బావి వద్దకు ఈతకు వెళ్లాడు.
అయితే అశోక్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలోపడి మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సర్పంచ్ నా గరాజు, ఎంపీటీసీ వెంకటన్న, గ్రామస్తులు వెం ట నే అక్కడికి చేరుకుని అశోక్ కోసం బావిలో వెతికి నా ఫలితం లేకపోవడంతో ఫైర్‌స్టేషన్‌కు సమాచా రం అందించారు. వారు అక్కడికి చేరుకుని బా విలో ఉన్న నీటిని తోడి వేసి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విష యం తెలుసుకున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష ్ణమోహన్‌రెడ్డి సంఘట న స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని భరో సా ఇచ్చారు. సంఘటనపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment