రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు, నేహ మృతదేహం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలో ఎండీ. నేహ(15) అనే బాలిక ఉరివేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాలికను ఓ యువకులు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తుండడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. నిందితున్ని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వన్‌టౌన్ పోలీసుల వివరాల మేరకు... స్థాని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎండీ జలేఖభేగంకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కుమా రుడు, కోడలు అబ్దుల్ లతీఫ్, షబానా దంపతులు ఆరేళ్ల వయసులో ఉన్న వారి కూతురు నేహాను ఇంట్లో వదిలేసి కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో నేహకు అన్నీతానైన నాయనమ్మ జలేఖభేగం, బాబాయ్ అబ్దుల్ రజాక్ ఆలనాపాలన చూ సుకుంటున్నారు. ఉర్దూ మీడియంలో నేహా 7వ తరగతి వరకు చదువుకుంది.
శనివారం జలేఖభేగం కూతురును చూసేందుకు మంచిర్యాలకు వెళ్లగా, బాబాయ్ వారసంతలో కూరగాయలు విక్రయించడానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నేహ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన నాయనమ్మ, బాబాయ్ ఉరికి వేళ్లాడుతున్న నేహను చూసి షాక్‌కు గురయ్యారు. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
వన్‌టౌన్ సీఐ ఎస్.వాసుదేవరావు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ‘నన్ను క్షమించం డి... నేను ఏ తప్పు చేయలేదు...’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించిందని సీఐ తెలిపారు. అలాగే ఆర్టీసీ చైర్మన్, తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, రామగుండం నగరపాలక సంస్థ మేయర్ చిట్టూరి రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ప్రేమ పేరుతో వేధింపులు...
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన మాతంగి కిరణ్ అలియాస్ నిఖిల్ గత కొంతకాలంగా నేహను ప్రేమించాలంటూ ఫోన్‌లో వేధింపులకు గురి చేయడంతోపాటు వెంటపడుతున్నాడు. శనివారం నేహ బాబాయ్ రజాక్‌కు నిఖిల్ ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశాడని ఆరోపించారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే నేహ ఆత్మహత్య చేసుకుందని నాయనమ్మ, బాబాయ్‌లు రజాక్, సమర్‌తోపాటు బంధువులు ఆరోపించారు.
గుండెలవిసేలా రోదించిన నాయనమ్మ...
‘‘ఎంత పనిచేసిన్ బేటా... నన్ను వదిలిపోయావా...’’ అంటూ నేహ మృతదేహం దగ్గర నాయనమ్మ జలేఖభేగం గుండెలవిసేలా రోధించింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేస్తే, అనాథ కావద్దని నేహను కన్న కూతురుగా పెంచుకుం టున్నానని... ఇలా చనిపోతుందని అనుకోలదని జలేఖభేగం రోదించింది.
నిందితున్ని అరెస్ట్ చెయ్యాలని ధర్నా...
నేహ మృతికి కారకుడైన నిందితున్ని అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువు లు, ముస్లిం పెద్దలు, యువకులు గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐ లు వాసుదేవరావు, మహేందర్ జోక్యం చేసుకొని ఆందోళనకారులను శాంతిపజేశారు. నిందితునిపై పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఐ వాసుదేవరావు
Comments
Please login to add a commentAdd a comment