
సాక్షి, ఆసిఫాబాద్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు నిరాశకులోనై ఉరేసుకున్నాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన హనుమయం సందీప్ (27) బీఈడీ పూర్తిచేసి, పలు పోటీ పరీక్షలు రాశాడు. అయితే ఎన్ని పరీక్షలు రాసినా తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదన్న మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పట్టణ సీఐ అరె వెంకటేశ్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.