మక్తల్: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం వనాయికుంటలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన నర్సింహులు(45) తనకున్న 5 ఎకరాల్లో 15 బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. దీంతో వాటిలో నాలుగు ఎకరాలు అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు. మళ్లీ ఎకరా పొలంలో ఓ బోరు వేస్తే కొద్దిపాటి నీరు రావడంతో వరి సాగు చేశాడు. విద్యుత్ సరఫరా లేక పంట ఎండిపోయింది. దాంతో ఆ పంటను పశువులు మేత కోసం వదిలాడు.
పంటల సాగుకు, బోర్లు వేయడానికి దాదాపు రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆదివారం రాత్రి పురుగుమందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Tue, Apr 5 2016 8:09 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement