'చేనేత బతుకమ్మ' పోస్టర్‌ ఆవిష్కరించిన కవిత | MP Kavitha reveals chenetha bathukamma poster | Sakshi
Sakshi News home page

'చేనేత బతుకమ్మ' పోస్టర్‌ ఆవిష్కరించిన కవిత

Published Wed, Sep 13 2017 8:35 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

MP Kavitha reveals chenetha bathukamma poster

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్‌(టాక్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ ౩౦న నిర్వహించనున్న లండన్-చేనేత బతుకమ్మ-దసరా వేడుకల పోస్టర్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్లో టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్ శానబోయిన, సుభాష్ కుమార్లు ఎంపీ కవితను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాల స్పూర్తితో, ఈ సంవత్సరం టాక్ జరిపే వేడుకలను 'చేనేత బతుకమ్మ'గా నిర్వహిస్తున్నామన్నారు. వీలైనంత వరకు ప్రవాసుల్లో చేనేత పై అవగాహన కలిపించి, చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్టు తెలిపారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ కవిత శుభాకాంక్షలు తెలిపారు.

లండన్ నుండి టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ఫోన్ ద్వారా మీడియాకి తన సందేశాన్నిచ్చారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి అన్ని సందర్భాల్లో కవిత ప్రోత్సాహం మరవలేనిదన్నారు. 'చేనేత బతుకమ్మ' పోస్టర్ ఆవిష్కరించి తమలో నూతన ఉత్సాహాన్ని నింపిన కవితకి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ ౩౦న ఉదయం 10 గంటల నుండి వెస్ట్ లండన్లోని 'ఐసల్ వర్త్ అండ్ సయాన్ స్కూల్' ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రవాసులంతా వీలైతే చేనేత దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరం చేనేతకు అండగా నిలవాల్సిన చారిత్రాత్మక సమయమిదని తెలిపారు. చేనేత వస్త్రాలకు www.tauk.org.uk వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చేనేత చీరలను అందిస్తుందని, మనమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అన్ని బతుకమ్మ వేడుకల్లో చేనేతకు ప్రాధాన్యతనిస్తూ చేనేత దుస్తులతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న టాక్ ప్రతినిధులు రాజ్ కుమార్, సుభాష్, జాగృతి నాయకులు సంతోష్ రావు  కొండపల్లి, శరత్ రావు, ప్రణీత్ రావు, నవీన్ ఆచారి, విజయ్ కోరబోయిన, భిక్షపతి, రోహిత్ రావులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement