శతాధికురాలు మృతి | 103 years aged woman died | Sakshi
Sakshi News home page

శతాధికురాలు మృతి

Published Wed, Aug 17 2016 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

103 years aged woman died

పెదమల్లం(ఆచంట) : పెదమల్లం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు దిరిశాల చంద్రమ్మ(103) మరణించారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం రాత్రి ఆమె స్వగృహంలో మరణించారు. ఈమెకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మనుమలు, ముని, ఇని మనుమలు అంతా కలిపి మొత్తం 105 మంది ఉన్నారు. ఇప్పటివరకూ ఆమె ఎనిమిది పుష్కరాల్లో  పుణ్యస్నానమాచరించారు. గత పుష్కరా సందర్భంగా ఆమె తన అనుభవాలను ‘సాక్షి’ పాఠకులతో పంచుకున్నారు.  2014 డిసెంబరు 21న  చంద్రమ్మకు కుటుంబ సభ్యులు వసంతోత్సవం నిర్వహించారు. చంద్రమ్మ మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని సందర్శించారు.  గ్రామ సమీపంలోని వశిష్ట గోదావరిలో బుధవారం కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రమ్మ మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్,  సర్పంచ్‌ కొండేటి వీరాస్వామి, మాచేనమ్మ దేవస్థానం చైర్మన్‌ దిరిశాల ప్రసాద్‌ సంతాపం తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement