జనగామ(వరంగల్): వరంగల్ జిల్లా జనగామలో గత 85 రోజులుగా కొనసాగుతున్న 144వ సెక్షన్‌ను ఎత్తేస్తున్నట్టు డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆదివారం తెలిపారు. చట్టపరిధిలో శాంతియుత ఉద్యమాలకు మినహా.. అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడితే తిరిగి 144 సెక్షన్‌ను పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. ప్రత్యేక జిల్లా కోరుతూ.. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండటంతో.. 85 రోజుల నుంచి పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే.