చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు : 15 మందికి గాయాలు | 15 injured in apsrtc bus accident in guntur district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు : 15 మందికి గాయాలు

Published Sat, Jan 9 2016 11:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

15 injured in apsrtc bus accident in guntur district

గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లక్ష్మీపురం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు... చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

సదరు ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement