
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
యాలాల(రంగారెడ్డి జిల్లా): కాగ్నా నదిలోంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు వచ్చిన మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు బుధవారం పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ షౌకత్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అగ్గనూరు సమీపంలోని కాగ్నానది నుంచి ఇసుకను తరలించేందుకు మూడు ట్రాక్టర్ల పాయింట్ వద్దకు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన రెవెన్యూ సిబ్బంది ట్రాక్టర్లను పట్టుకొని, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.