300 మంది వైఎస్సార్సీపీలో చేరిక
నంద్యాల వ్యవసాయం: పట్టణంలోని ఎస్‌డీపీఐ కార్యకర్తలు 300మంది శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. హబీబుల్లా ఆధ్వర్యంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హబీబుల్లా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైనికుల్లా పని చేసి శిల్పా విజయానికి కృషి చేయాలన్నారు. కర్నూలు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ దేశంలో ముస్లింలకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేలు చేశారన్నారు. అందుకు నంద్యాల ఉప ఎన్నికలో ముస్లింలు వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా గెలుపునకు కృషి చేయాలన్నారు.
ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని మోసాలు, కుట్రలు పన్నినా నంద్యాలలో గెలిచేది వైఎస్సార్సీపీనే అన్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఓటమి భయంతో తమ పార్టీ నాయకుల ఇళ్లపైన పోలీసులతో దాడులు చే యిస్తోందని చెప్పారు. టీడీపీ ఆగడాలను పట్టణ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ఓటుతో ఆ పార్టీకి గుణపాఠం నేర్పుతారన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎస్‌డీపీఐ నాయకులు బాషా, జీయాస్ బాషా, మహబూబ్‌బాషా, సమీర్, ఫయాజ్, జావిద్, ముత్తు, తలహా, షఫీ, ముజహిద్, జబిఉల్లా, ఇలియాస్ తదితరులు ఉన్నారు.