అనంతపురం అగ్రికల్చర్: విత్తన పంపిణీలో భాగంగా 48వ రోజు గురువారం జిల్లా వ్యాప్తంగా 339 మంది రైతులకు 381 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ చేసినట్లు జేడీఏ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 2,87,713 మంది రైతులకు 3,31,355 క్వింటాళ్లు అందజేసినట్లు వెల్లడించారు. 20,529 మంది రైతులకు 2,365 క్వింటాళ్లు విత్తన కందులు, 46,226 మంది రైతులకు 94,441 బహుధాన్యపు కిట్లు, 3,892 మంది రైతులకు 654 క్వింటాళ్లు మొక్కజొన్న పంపిణీ చేశామన్నారు. ఇందులో ఎంవీకేల ద్వారా 52,093 క్వింటాళ్లు వేరుశనగ, 61,053 బహుధాన్యపు కిట్లు ఇచ్చారని తెలిపారు.