4జీతో మరింత సౌలభ్యం | 4g is compfort for consumers | Sakshi
Sakshi News home page

4జీతో మరింత సౌలభ్యం

Published Wed, Aug 31 2016 12:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

4g is compfort for consumers

శాంతినగర్‌: వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్‌లో ఐడియా 4జీ సేవలు ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని మానవపాడు ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి అన్నారు. ఐడియా సంస్థ 4జీ సేవలు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌చేసి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గతేడాది శాంతినగర్‌లో త్రీజీ సేవలు ప్రారంభించిన ఐడియా సంస్థ ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతున్న తరుణంలో వినియోగదారుల సౌకర్యం కొరకు 4జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. అనంతరం ఐడియా సంస్థ ఏరియా సేల్స్‌ మేనేజర్‌ జగన్నాథనాయుడు మాట్లాడుతూ శాంతినగర్‌లో ఇంటర్నెట్‌ వాడకం 50శాతం పెరిగిందని, అందువల్లే ఇంటర్నెట్‌ 4జీ స్పీడుతో మరింత వేగంగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వాడుతున్న వినియోగదారులకే 4జీ సిమ్‌ అదేనెంబర్‌పై ఇస్తూ కొత్త కష్టమర్లకు 2జీబీ 4జీ డేటా ఇస్తున్నామన్నారు. రాబోయే ఆరునెలల్లో ప్రతి గ్రామానికి త్రీజీ సేవలు విస్తరిస్తామన్నారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి 4జీ సేవల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఐడియా టీఎస్‌ఈలు ఖలీల్, హనీఫ్, గంగాధర్, స్థానిక డిస్ట్రిబ్యూటర్‌ ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement