గండేపల్లి (తూర్పుగోదావరి జిల్లా) : గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద లారీ ఢీకొని పోతుల ధనుంజయ కార్తికేయ(5) అనే బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాలుడి మృతితో కుటుంబసభ్యులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.