గుమ్మఘట్ట: ప్రభుత్వాస్పత్రుల్లో మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు త్వరలో 500 పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం రాత్రి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, నియోజవర్గ ప్రత్యేక ఐఏఏస్ అధికారి చక్రధర్, ఆర్డీఓ రామారావులతో కలసి ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేల్లో భాగంగా 1044 రకాల వ్యాధులకు 2.5 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందిస్తామన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ అతి తక్కువగా ఉన్న చోట మందుల ఏటీఎం ఏర్పాటు చేస్తామన్నారు. పూలకుంట, గుమ్మఘట్ట గ్రామాలలో వేరుశనగ పొలాలను సందర్శించి రెయిన్‌గన్ తడులను పరిశీలించారు. జెడ్పీటీసీ పూల నాగరాజు, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఎంపీపీ గిరిమల్లప్ప, మునిసిపల్ చైర్మన్ రాజశేఖర్‌బాబు, ఏడీ మద్దిలేటి, తహసీల్దార్ అఫ్జల్‌ఖాన్,ఎంపీడీఓ జి.మునయ్య, ఏఓ శ్రీనివాస్‌రావ్‌తో పాటు ఇతర శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
త్వరలో 500 డాక్టర్ పోస్టుల భర్తీ
Published Tue, Aug 30 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
Advertisement